బాలీవుడ్ ప్రేమపక్షులు రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. వారు ఎక్కడ కనిపించనా అది వార్తే. అలాంటిది రణ్‌బీర్‌కు కరోనా రావడం వల్ల వీరిద్దరూ కలుసుకోలేకపోతున్నారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. 'చాలా మిస్ అవుతున్నా' అంటూ ఓ చేతిని పట్టుకున్న ఫొటోను పోస్ట్ చేసింది ఆలియా. ఇది చూసిన నెటిజన్లు ఆ చేయి రణ్బీర్దే అని.. అతడు తొందరగా కోలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు.
రణ్‌బీర్.. నిన్ను చాలా మిస్ అవుతున్నా: ఆలియా - రణ్‌బీర్‌ను ఆలియా చాలా మిస్ అవుతుందట!
బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్‌కు కరోనా సోకింది. దీంతో రణ్‌బీర్‌ను చాలా మిస్ అవుతోందట అతడి ప్రేయసి ఆలియా భట్. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో ఆమె పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
రణ్‌బీర్‌ను ఆలియా చాలా మిస్ అవుతుందట!
ప్రస్తుతం అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'బ్రహ్మాస్త్ర'లో కలిసి నటిస్తున్నారు రణ్‌బీర్, ఆలియా. రణ్‌బీర్‌కు కరోనా రావడం వల్ల షూటింగ్ నిలిచిపోయింది. అయితే ఆలియాకు మాత్రం నెగిటివ్‌గా తేలడం వల్ల చిత్రీకరణలో పాల్గొంటోందీ భామ. ప్రస్తుతం ఆలియా 'గంగూబాయ్ కతియావాడి', 'ఆర్ఆర్ఆర్' చిత్రాలు చేస్తోంది.