నాగచైతన్య, సమంత జంటగా నటిస్తున్న చిత్రం "మజిలీ". ఇందులోని 'వన్ బాయ్ వన్ గర్ల్' అంటూ సాగే లిరికల్ పాటను విడుదల చేసింది చిత్రబృందం. పెళ్లిపై వ్యంగంగా రూపొందించిన ఈ పాటలోని లిరిక్స్.. యువతను ఆకట్టుకునేలా ఉన్నాయి.
"ప్రేమా... నువ్వెక్కడ?" - vizag
నాగచైతన్య , సమంత భార్య భర్తలుగా నటించిన "మజిలీ" సినిమాలోని "వన్ బాయ్ వన్ గర్ల్" లిరికల్ పాట విడుదలైంది.
మజిలీ చిత్రంలో 'వన్ బాయ్ వన్ గర్ల్' లిరికల్ పాట
దివ్యాంశ కౌశిక్ మరో హీరోయిన్గా నటిస్తుండగా, క్రికెటర్గా కనిపించనున్నాడు చైతన్య. వైజాగ్ నేపథ్యంలో సినిమా మొత్తం సాగనుంది. "నిన్ను కోరి"తో ఆకట్టుకున్న శివ నిర్వాణ దర్శకత్వం వహించాడు. వేసవి కానుకగా ఏప్రిల్ 5న రానుందీ చిత్రం.