నాగచైతన్య, సమంత ప్రధాన పోత్రలు పోషించిన చిత్రం మజిలీ. ఈ సినిమాలోని చివరి లిరికల్ పాటను విడుదల చేసింది చిత్రబృందం. గోపిసుందర్ సంగీతం అందించిన ఈ పాట ఆకట్టుకునేలా ఉంది.
ఏ మనిషికి ఏ మజిలీయో చూపేది పైవాడే... - naga chaitanya
మజిలీ చిత్రంలోని ఆఖరి లిరికల్ పాట విడుదలైంది. వనమాలి సాహిత్యం అలరించేలా ఉంది.
![ఏ మనిషికి ఏ మజిలీయో చూపేది పైవాడే...](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2758992-973-2d979025-3a5b-4592-9160-5b8d6f2a4ac7.jpg)
మజిలీ
"ఏ మనిషికే మజిలీయో పైవాడు చూపిస్తాడు.. నువ్ కోరుకుంటే మాత్రం దొరికేదీ కాదంటాడు" అంటూ వనమాలి రాసిన లిరిక్స్ యవతను ఆకట్టుకునేలా ఉన్నాయి.
పెళ్లైన తర్వాత నాగచైతన్య, సమంత మొదటిసారి కలిసి నటిస్తున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. నిన్ను కోరి ఫేం శివనిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 5న విడుదలవనుంది.