ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేెశ్ తనయుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ఇప్పటికే హీరోగా తానేంటో నిరూపించుకున్నాడు. తాజాగా ఈ నిర్మాత చిన్న కుమారుడు బెల్లంకొండ గణేశ్‌ను తెరకు పరిచయం చేయబోతున్నాడని సమాచారం. గణేశ్ సరసన మజిలీ చిత్రంలో చిన్నపాపగా నటించిన అనన్య అగర్వాల్‌ను హీరోయిన్గా తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
16 ఏళ్ల ఈ యువనటి ఇప్పటికే బాలీవుడ్‌లో పలు హిట్ చిత్రాల్లో నటించింది. ‘మజిలీ’లో నాగచైతన్యకు కూతురిగా కనిపించి మెప్పించింది. వయసు రీత్యా అనన్య చిన్నదే అయినప్పటికీ చూడటానికి కాస్త ఎక్కువ వయసున్న యువతిలా కనిపిస్తుంది. అందుకే ఈ పాత్ర కోసం అనన్య అగర్వాల్‌నే తీసుకున్నారట. ఓ సరికొత్త ప్రేమకథతో ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారని సమాచారం.