తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కంబాలపల్లి కథలు.. న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివల్​కు - ప్రియదర్శి మెయిల్ మూవీ

'కేరాఫ్ కంచరపాలెం' తర్వాత న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్​ ఫెస్టివల్​లో అవకాశం దక్కించుకుంది తెలుగు చిత్రం 'మెయిల్'. ఈ విషయాన్ని నిర్మాతలు, శనివారం వెల్లడించారు.

Mail movie New York Indian Film Festival
మొయిల్ సినిమా

By

Published : May 8, 2021, 3:59 PM IST

Updated : May 8, 2021, 6:05 PM IST

తెలుగు సినీ ప్రేక్షకుల్ని మెప్పించిన 'మెయిల్' సినిమా అద్భుత ఘనత సాధించింది. జూన్ 4న మొదలయ్యే న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ​ఫెస్టివల్​లో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

మొయిల్ మూవీ

ఈ ఏడాది ప్రారంభంలో 'ఆహా' ఓటీటీలో వచ్చిన 'మెయిల్'.. గ్రామీణ నేపథ్య కథతో తెరకెక్కించారు. కంప్యూటర్​ వచ్చిన కొత్తలో దానివల్ల ఓ గ్రామంలోని ముగ్గురు యువకులు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు? వాటివల్ల ఎదురైన ఇబ్బందుల్ని ఎలా అధిగమించారు? అనే కథతో సినిమా తీశారు. ప్రియదర్శి, హర్ష, ప్రియ తదితరులు తమ నటనతో ఆకట్టుకున్నారు. ఉదయ్ గుర్రాల దర్శకుడిగా ప్రేక్షకుల మనసు గెల్చుకున్నారు.

మొయిల్ సినిమా
Last Updated : May 8, 2021, 6:05 PM IST

ABOUT THE AUTHOR

...view details