'మహానటి'తో జాతీయ అవార్డు కొల్లగొట్టిన దక్షిణాది హీరోయిన్ కీర్తి సురేశ్.. బాలీవుడ్లో నటిస్తున్న తొలి సినిమా 'మైదాన్'. అజయ్ దేవగణ్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఫస్ట్‌లుక్‌ను సోమవారం విడుదల చేసింది చిత్రబృందం. 1952-62 మధ్య కాలంతో భారత ఫుట్‌బాల్ జట్టు అద్భుత ప్రదర్శనల ఆధారం ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
ఫుట్‌బాల్ కథతో కీర్తి సురేశ్ బాలీవుడ్ ఎంట్రీ - కీర్తి సురేశ్
నటి కీర్తి సురేశ్.. బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్న సినిమాకు 'మైదాన్' అనే టైటిల్ నిర్ణయించారు. ఫస్ట్‌లుక్‌ను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది చిత్రబృందం.
ఫుట్‌బాల్ కథతో కీర్తి సురేశ్ బాలీవుడ్ ఎంట్రీ
'బదాయి హో'ను తెరకెక్కించిన అమిత్ రవీందర్ దర్శకత్వం వహిస్తున్నాడు. బోనీ కపూర్, ఆకాశ్ చావ్లా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2020 ద్వితీయార్థంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు సమాచారం.
ఇది చదవండి: షారుఖ్ ఖాన్ అలా హాకీ కోచ్ అయ్యాడు
Last Updated : Sep 27, 2019, 12:50 PM IST