సూపర్‌స్టార్ మహేశ్‌బాబు(MaheshBabu) కుమారుడు గౌతమ్.. తండ్రికి తగ్గ తనయుడు అని నిరూపించుకున్నాడు. తెలంగాణలో తన వయసు గల వారిలో తొలి ఎనిమిది ఈతగాళ్లలో చోటు సంపాదించుకున్నాడు. ఈ విషయాన్ని మహేశ్ భార్య నమ్రతా శిరోద్కర్ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. గౌతమ్ ఈ ఘనత సాధించడం గర్వంగా భావిస్తున్నట్లు తెలిపారు. అతడికి బటర్‌ఫ్లై బ్యాక్‌స్ట్రోక్, బ్రెస్ట్‌స్ట్రోక్, ఫ్రీస్టైల్ స్విమ్మింగ్ చేయగలడని వెల్లడించారు. ఫ్రీస్టైల్ స్విమ్మింగ్‌ను మూడు గంటల్లో 5 కిలోమీటర్లు ఈదగలుగుతాడని చెప్పారు.
mahesh babu - gautham: తండ్రికి తగ్గ తనయుడిగా గౌతమ్ - gowtham top swimmers
హీరో మహేశ్‌బాబు((Mahesh Babu) తనయుడు గౌతమ్ ఆటల్లో సత్తాచాటుతున్నాడు. స్విమ్మర్‌గా రాణిస్తూ టాప్-8లో నిలిచాడు. ఈ విషయాన్ని నమ్రతా ఇన్‌స్టా వేదికగా వెల్లడించారు.
మహేశ్
గౌతమ్.. మహేశ్‌బాబు నటించిన 'వన్' సినిమాతో బాలనటుడిగా వెండితెర అరంగేట్రం చేశాడు. ప్రస్తుతం చదువుకుంటున్న అతడు సినిమాల్లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడో అని మహేశ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సూపర్‌స్టార్ ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' సినిమాలో నటిస్తున్నారు.
ఇదీ చూడండి: మహేశ్ నా భర్త అని అప్పుడే ఫిక్సయ్యా: నమ్రత