తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆ రికార్డు సాధించిన తొలి తెలుగు చిత్రం 'శ్రీమంతుడు' - srimanthudu 1 crore views on youtube

సూపర్​స్టార్ మహేశ్ బాబు కెరీర్​లో బ్లాక్​బస్టర్​గా నిలిచిన 'శ్రీమంతుడు' సినిమా మరో అరుదైన రికార్డు దక్కించుకుంది. యూట్యూబ్​లో 100 మిలియన్ వీక్షణలు దక్కించుకున్న తొలి తెలుగు చిత్రంగా ఘనత సాధించింది.

శ్రీమంతుడు
శ్రీమంతుడు

By

Published : Apr 17, 2020, 6:18 PM IST

టాలీవుడ్ సూపర్​స్టార్ మహేశ్​ బాబు కెరీర్​లో బ్లాక్​బస్టర్​లుగా నిలిచిన సినిమాల్లో 'శ్రీమంతుడు' ఒకటి. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు దక్కించుకుంది. అభిమానుల మనసూ దోచుకుంది. తాజాగా ఈ చిత్రం ఓ రికార్డు సృష్టించింది.

ఈ సినిమా యూట్యూబ్‌లో 100 మిలియన్ వీక్షణలు దక్కించుకుంది. తెలుగులో విడుదలైన ఏ చిత్రం ఇప్పటి వరకు 100 మిలియన్ వ్యూస్ సాధించలేదు. ఫలితంగా మహేశ్ ఫ్యాన్స్​ సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండింగ్​లో ఉంది.

తెలుగులో ఇప్పటివరకు వచ్చిన తెలుగు పాటలతో పాటు హిందీలో డబ్బింగ్ అయిన సినిమాలు మాత్రమే 100 మిలియన్ వ్యూస్‌కు పైగా దక్కించుకున్నాయి. కానీ స్ట్రెయిట్‌గా ఓ తెలుగు చిత్రం యూట్యూబ్‌లో 100 మిలియన్ వ్యూస్‌ దక్కించుకోవడం ఇదే మొదటిసారి.

శ్రీమంతుడు

ABOUT THE AUTHOR

...view details