సూపర్‌స్టార్ మహేశ్‌బాబు తన బావ సుధీర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. 'శ్రీదేవి సోడా సెంటర్' (sridevi soda center) చిత్రంలో సుధీర్ నటన అద్భుతంగా ఉందంటూ పొగిడారు. శుక్రవారం సాయంత్రం స్పెషల్‌గా ఈ చిత్రాన్ని వీక్షించిన మహేశ్.. తాజాగా ట్విటర్ వేదికగా సినిమాపై తన అభిప్రాయాన్ని బయటపెట్టారు. చిత్రబృందంలోని ప్రతి ఒక్కర్నీ పేరు పేరునా అభినందించారు. మిస్ కాకుండా అందరూ ఈ చిత్రాన్ని వీక్షించాలన్నారు.
"క్లిష్టతరమైన క్లైమాక్స్‌తో అద్భుతమైన ప్రేమకథా చిత్రం 'శ్రీదేవి సోడా సెంటర్'. 'పలాస 1978' తర్వాత కరుణకుమార్ మరోసారి సామాజిక కోణంలో చిత్రాన్ని తెరకెక్కించిన విధానం బాగుంది. సుధీర్ అద్భుతంగా నటించాడు. ఇప్పటివరకు వచ్చిన సినిమాలతో పోలిస్తే 'సూరిబాబు' పాత్రలో ఆయన ఒదిగిపోయిన తీరు బాగుంది. నరేశ్ మరోసారి తన నటనతో మెప్పించేశారు. ఆనంది గురించి ప్రత్యేకంగా చెప్పాలి. శ్రీదేవి పాత్రకు ఆమె పర్‌ఫెక్ట్‌గా సరిపోయారు. విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. ఈ చిత్రాన్ని మిస్ కాకండి. చిత్రబృందం మొత్తానికి నా అభినందనలు"