తెలంగాణ

telangana

ETV Bharat / sitara

దేవీశ్రీ ప్రసాద్ పాట.. సితార,ఆద్య ఆట..! - sitara

దేవీశ్రీ పాడుతుంటే మహేశ్ బాబు కూతురు సితార, వంశీ పైడిపల్లి కుమార్తె ఆద్య ఆట​తో ఆకట్టుకున్నారు. ఈ వీడియోను దేవీశ్రీ ప్రసాద్ ఇన్​స్టాగ్రామ్​లో పంచుకున్నాడు.

దేవీతో సితార, ఆద్య

By

Published : Mar 23, 2019, 1:01 PM IST

ఇటీవలే బాహుబలి పాటకు డ్యాన్స్ చేసి ఆకట్టుకున్న మహేష్ కూతురు సితార ఇప్పుడు 'చారుశీల..' పాటకు నృత్యం చేసి అలరించింది. ఈసారి దేవీ శ్రీ ప్రసాద్ పాట పాడుతుంటే వీరి సందడికి దర్శకుడు వంశీ పైడిపల్లి కూతురు ఆద్య తోడైంది. సంబంధిత వీడియోను ఇన్​స్టాలో పంచుకున్నాడు దేవీ. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.

మహేశ్​బాబు 'మహర్షి' సినిమాలోని మొదటి పాట మార్చి 29న రానుంది. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం మే 9న విడుదల కానుంది. పూజా హెగ్డే హీరోయిన్​గా నటిస్తుండగా...అల్లరి నరేశ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.

ABOUT THE AUTHOR

...view details