తెలంగాణ

telangana

By

Published : Jan 9, 2022, 8:48 AM IST

ETV Bharat / sitara

మధ్యాహ్నం రమేశ్​బాబు అంత్యక్రియలు.. కొవిడ్​ నిబంధనలు తప్పనిసరి

Ramesh babu cremation: అస్వస్థతకు గురై తుదిశ్వాస విడిచిన సూపర్​ స్టార్​ కృష్ణ పెద్ద కుమారుడు రమేశ్​బాబు అంత్యక్రియలు మధ్యాహ్నం ఒంటిగంటకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో నిర్వహించనున్నారు. ముందుగా ఆయన భౌతికకాయాన్ని.. కుటుంబసభ్యుల సందర్శనార్థం పద్మాలయ స్టూడియోలో ఉంచనున్నారు.

Maheshbabu brother Ramesh babu cremation
మధ్యాహ్నం రమేశ్​బాబు అంత్యక్రియలు

Mahesh babu brother died: అనారోగ్యంతో కన్నుమూసిన సూపర్‌ స్టార్‌ కృష్ణ పెద్ద కుమారుడు, మహేశ్‌బాబు సోదరుడు ఘట్టమనేని రమేశ్‌బాబు (56) అంత్యక్రియలు మధ్యాహ్నం ఒంటిగంటకు జూబ్లీహిల్స్​ మహాప్రస్థానంలో జరగనున్నాయి. ఏఐజీ ఆస్పత్రిలో ఉన్న రమేశ్​ భౌతికకాయాన్ని.. కుటుంబసభ్యుల సందర్శనార్థం మరికాసేపట్లో పద్మాలయ స్టూడియోకు తరలించనున్నారు.

కాగా, అంత్యక్రియల సమయంలో అభిమానులు గుమికూడకుండా ఉండాలని కోరింది ఘట్టమనేని కుటుంబం. ప్రతిఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేసింది.

కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రమేశ్​ శనివారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలిస్తుండగా ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

'అల్లూరి సీతారామరాజు' (1974) చిత్రం ద్వారా వెండితెర ప్రవేశం చేశారు రమేశ్​బాబు. కృష్ణ, మహేశ్‌బాబుతో కలిసి పలు సినిమాల్లో నటించారు. సుమారు 15 చిత్రాల్లో ఆయన కీలకపాత్రలో పోషించారు. 1997 నుంచి నటనకు దూరంగా ఉన్న రమేశ్‌బాబు 2004లో నిర్మాతగా మారారు. 'అర్జున్‌', 'అతిథి' సినిమాలు నిర్మించారు.

ఇదీ చూడండి: నటుడు మహేశ్‌బాబు సోదరుడు రమేశ్‌బాబు కన్నుమూత

ABOUT THE AUTHOR

...view details