తెలంగాణ

telangana

ETV Bharat / sitara

టైమ్స్​ ఫరెవర్ డిజైరబుల్ లిస్టులో మహేశ్ - టైమ్స్

సూపర్​స్టార్ మహేశ్​.. ప్రఖ్యాత టైమ్స్​ మ్యాగజిన్ ప్రకటించిన మోస్ట్​ ఫరెవర్ డిజైరబుల్ మెన్ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఈ లిస్టులో ప్రిన్స్​తో పాటు బాలీవుడ్ స్టార్లు సల్మాన్, షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్, అక్షయ్​ కుమార్ పేర్లు ఉన్నాయి.

మహేశ్

By

Published : May 17, 2019, 1:01 PM IST

మహర్షి చిత్రంతో మంచి హిట్​ అందుకున్న మహేశ్.. తాజాగా మరో ఘనత సాధించాడు. టైమ్స్ మ్యాగజిన్ ప్రకటించిన మోస్ట్ ఫరెవర్ డిజైరబుల్ మెన్​ జాబితాలో చోటు సంపాదించాడు. దక్షిణభారతదేశం నుంచి మహేశ్ ఒక్కడే ఈ ఘనత సాధించడం విశేషం. ఈ లిస్టులో ప్రిన్స్​తోపాటు బాలీవుడ్ నటులు సల్మాన్, షారుఖ్​, అమీర్, అక్షయ్​కుమార్​ ఉన్నారు.

టైమ్స్​ మ్యాగజైన్​లో మహేశ్​

ప్రతి ఏడాది మోస్ట్​ డిజైరబుల్ కేటగిరీలో టైమ్స్​ మ్యాగజిన్ 50 మంది పేర్లు ప్రకటిస్తుంది.2010 నుంచి మహేశ్ ఈ జాబితాలో చోటు సంపాదిస్తున్నాడు. ఏటా కొత్త నటులు వచ్చి యువతలో క్రేజ్​ తెచ్చుకుంటూ దూసుకెళ్తున్నారు. అందుకని ఈ ఏడాది నుంచే మోస్ట్​ ఫరెవర్ డిజైరబుల్ లిస్ట్​ ప్రకటించింది టైమ్స్​. ఆ జాబితాలో మహేశ్ చోటు దక్కించుకున్నాడు. మోస్ట్​ డిజైరబుల్ టాప్-50 జాబితాలో సల్మాన్, షారుఖ్​, అక్షయ్​, మహేశ్ పేర్లు లేవు.

ABOUT THE AUTHOR

...view details