పరుశురామ్ దర్శకత్వంలో మహేశ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం సర్కారు వారి పాట. ఈ ఇద్దరి కలయికతో వస్తున్న మొదటి సినిమా ఇదే కాగా.. ఈ మూవీ కోసం ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అటు.. షూటింగ్ కూడా ఫుల్ స్వింగ్‌లో జరుగుతోంది. అయితే.. ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం మొదట అర్జున్ను ఎంచుకుంది చిత్ర బృందం. కానీ చివరి నిమిషంలో అర్జున్ తప్పుకోగా.. ఆ స్థానంలో జగపతిబాబు నటిస్తారని తెలుస్తోంది.
అయితే అర్జున్ ఎందుకు తప్పుకున్నారనే విషయంపై కారణాలు ఇంకా తెలియలేదు.
శ్రీమంతుడు మూవీలో మహేష్‌కు జగపతిబాబు తండ్రి పాత్ర పోషించాడు. మహర్షిలో విలన్‌గా మెప్పించారు. మరి వీరిద్దరి కాంబినేషన్ మళ్లీ సక్సెస్ అవుతుందో లేదో వేచి చూడాలి.