లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమైన సినీ తారలు దొరికిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. కుటుంబ సభ్యులతో జాలీగా గడుపుతున్నారు. కొందరు కొత్త నైపుణ్యాలపై దృష్టి పెడితే.. మరికొందరేమో ఇష్టమైన పనులు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు.
మహేశ్ సెల్ఫీ.. తమిళంపై రాశి పట్టు - లాక్డౌన్లో తారలు ఏమి చేస్తున్నారంటే
లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమైన సినీ తారలు తమకిష్టమైన వ్యాపకాలతో బిజీగా గడుపుతూ వారికి సంబంధించిన ఫొటోలను, వీడియోలను అభిమానులతో పంచుకుంటున్నారు. నెటిజన్లు వీటికి ఫిదా అయిపోయి విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు.
ఏదేమైనప్పటికీ సోషల్‌మీడియా వేదికగా మాత్రం అభిమానులకు చేరువగానే ఉన్నారీ తారలు. అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు తన పిల్లలు గౌతమ్, సితారతో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన బుధవారం షేర్ చేసిన సెల్ఫీ సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. "మహేశ్ వయసు తగ్గిపోతోందా?, యంగ్ లుక్, సూపర్.." అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. హీరోయిన్ రాశీ ఖన్నా తమిళ భాష నేర్చుకుంటుంది. ఆన్‌లైన్‌లో శిక్షణ తీసుకుంటూ.. పరీక్షలు కూడా రాస్తున్నట్లు ఇటీవల తెలిపింది. ఇలా మన తారలు తాజాగా తమ సోషల్‌మీడియాలో ఖాతాల్లో ఏం షేర్ చేశారో ఓ లుక్కేద్దాం.
ఇదీ చూడండి : అనుష్కపై కేసు నమోదు.. కోహ్లీ విడాకులు ఇచ్చేయ్