తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మంత్రి కేటీఆర్​కు హీరో మహేశ్​బాబు మద్దతు - టాలీవుడ్​

తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​కు టాలీవుడ్​ సూపర్​స్టార్​ మహేశ్​బాబు మద్దతు తెలిపాడు. ప్రజలు జ్వరాల బారిన పడకుండా ఉండేందుకు మంత్రి కొన్ని సూచనలు చెప్పగా, వాటిని పాటించాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశాడు ప్రిన్స్​.

తెలంగాణ మంత్రి కేటీఆర్​కు మహేశ్​బాబు మద్దతు

By

Published : Sep 12, 2019, 3:35 PM IST

Updated : Sep 30, 2019, 8:38 AM IST

తెలంగాణ మంత్రి కేటీఆర్​కు ప్రిన్స్ మహేశ్​బాబు మద్దతు తెలిపాడు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వైరల్​ జ్వరాల బారిన పడే వారిసంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్​ కొన్ని సూచనలు చేశారు. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ట్విట్టర్​ వేదికగా విజ్ఞప్తి చేశారు.

" వైరల్ జ్వరాలు, డెంగీ రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. మీ ఇంటి ఆవరణలో ఉన్న నీటి తొట్టెలు, పూల కుండీలు, ఎయిర్ కూలర్లలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోండి. దోమల వ్యాప్తికి ఇవే కారణం. నా ఇంటి పరిసరాలను నేను తనిఖీ చేసి నిల్వ ఉన్న నీటిని తొలగించాను. మీరూ ఆ పనిచేసి ఫొటోలను నాతో పంచుకోండి" -కేటీఆర్​, పురపాలకశాఖ మంత్రి

కేటీఆర్ ట్వీట్​కు టాలీవుడ్ కథానాయకుడు ప్రిన్స్ మహేశ్​బాబు.. సోషల్ మీడియా వేదికగా మద్దతు తెలిపాడు.

" హైదరాబాద్ నగరవాసులరా... ప్రస్తుతం డెంగీ, వైరల్​ జ్వరాలు నగరంలో బాగా వ్యాపిస్తున్నాయి. మీ చుట్టూ ఉన్న పరిసరాలలో నీటి నిల్వ లేకుండా చూసుకోండి. అప్రమత్తంగా ఉండి ఆరోగ్యంపై జాగ్రత్త వహించండి" -మహేశ్​బాబు, సినీ నటుడు

పరిసరాల పరిశుభ్రతతోనే సీజనల్ వ్యాధుల నియంత్రణ సాధ్యమవుతుందని, ఇందుకోసం ప్రజల భాగస్వామ్యం అవసరమని చెప్పారు టాలీవుడ్​ హీరోలు ప్రభాస్​, వెంకటేశ్​.

ఇవీ చదవండి...

Last Updated : Sep 30, 2019, 8:38 AM IST

ABOUT THE AUTHOR

...view details