తెలంగాణ

telangana

ETV Bharat / sitara

"వారు లేనిదే ఇంతదూరం వచ్చేవాడిని కాదు" - మైనపు విగ్రహాం

మహేశ్ మైనపు విగ్రహాన్ని సింగపూర్ మేడమ్ టుస్సాడ్స్​ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. సోమవారం హైదరాబాద్​లో ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. దీనిపై మహేశ్ స్పందన ఇప్పుడు చూద్దాం!

మహేశ్

By

Published : Mar 27, 2019, 11:59 AM IST

మైనపు బొమ్మ గురించి మహేశ్ మాటల్లో
మేడమ్​ టుస్సాడ్స్​లో తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా ఆనందం కలిగించిందని మహేశ్ అన్నాడు. తన చిరకాల కల నెరవేరిందని హర్షం వ్యక్తంచేశాడు. మహేశ్ మైనపు విగ్రహాన్ని హైదరాబాద్​లో సోమవారం ఆవిష్కరించారు. సింగపూర్ మేడమ్​ టుస్సాడ్స్​లో మైనపు విగ్రహం ఏర్పాటుపై టాలీవుడ్ సూపర్ స్టార్ స్పందన ఎలా ఉందో ఇప్పడు చూద్దాం!

నమస్కారం మహేశ్ ?

నమస్కారమండి..

మేడమ్ టుస్సాడ్స్​లో మీ విగ్రహం పెట్టడం, అందులోనూ హైదరాబాద్​లో ఆవిష్కరించడం ఎలా అనిపించింది?

అనుకోకుండా కుదిరింది. దీనికి మేడమ్ టుస్సాడ్స్ సింగపూర్ బృందానికి ధన్యవాదాలు చెప్పాలి. తీరిక లేని షెడ్యూల్​తో సింగపూర్ వెళ్లడం కుదరలేదు. దీనికి వారు అంగీకరించి నా కోసం ఇక్కడ ఆవిష్కరించారు. అందుకు వారికి మరొక్కసారి కృతజ్ఞతలు. మా సొంత సినిమా థియేటర్లో, మా కుటుంబ సభ్యుల ముందు ఈ కార్యక్రమం జరిగింది. ఇంతకంటే ఆనందం మరొకటి లేదు. నా చిరకాల స్వప్నం తీరింది.

కుటుంబ సభ్యులు ఎలాంటి అనుభూతికి లోనయ్యారు? ముఖ్యంగా సితార గురించి చెప్పండి?

వాళ్లు చాలా సంతోషపడ్డారు. నా మైనపు విగ్రహాన్ని నేను చూడలేదు. ఫోటోలు చూశాను కానీ ప్రత్యక్షంగా ఇప్పుడే మొదటి సారి చూశాను. సితారకు అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. కానీ మైనపు విగ్రహాన్ని టచ్ చేస్తున్నప్పుడు తన కళ్లలో కనిపించిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేను.

మీ ఫ్యాన్స్ రియాక్షన్ చూస్తే ఏమనిపిస్తుంది?

దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎంతో ఆనందమేసింది. నా అభిమానులు లేకపోతే ఇంత దూరం వచ్చే వాడిని కాదు. నా తరఫున, అభిమానుల తరఫున మేడమ్ టుస్సాడ్స్ వారికి కృతజ్ఞతలు.

మేడమ్ టుస్సాడ్స్ మీ విగ్రహం ఏర్పాటు చేస్తామన్నప్పుడు ఏమనిపించింది? అసలు ఎలా ప్రారంభమైంది?

ఐదేళ్ల క్రితం వన్ నేనొక్కడినే చిత్రీకరణకు లండన్ వెళ్లాం. అక్కడ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియానికి వెళ్లినపుడు అందులోని మైనపు బొమ్మలు చూసి గౌతమ్ ఎంతో సంతోషించాడు. నా విగ్రహం కూడా ఓ రోజు పెడతారు అని ఆ సమయంలో అనుకున్నాను. గత ఏడాది మేడమ్​ టుస్సాడ్స్ నుంచి నమ్రతకు కాల్ వచ్చింది. తర్వాత తెలిసిందే..

మహర్షి సినిమా కోసం అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు? ఈ చిత్రం గురించి చెప్పండి?

మహర్షి ప్రచారాన్ని త్వరలో మొదలుపెట్టనున్నాం. మార్చి 29న సినిమాలో ఓ పాటను విడుదల చేయబోతున్నాం. మహర్షి నాకు ఎంతో ప్రత్యేకమైంది, ఇది నా 25వ చిత్రం. వంశీ పైడిపల్లి సినిమా కోసం చాలా కష్టపడ్డారు. మేము కూడా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం.

చివరగా ఈ విగ్రహం గురించి మీ అభిమానులకు ఏం చెప్పాలనుకుంటున్నారు?

ఎప్పుడైనా సింగపూర్ వెళ్తే సెల్ఫీలు దిగి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయండి. నన్ను ట్యాగ్ చేయండి.

ఒక్కరోజు మాత్రమే హైదరాబాద్​లో ఉన్న మహేశ్ మైనపు బొమ్మను సింగపూర్ తరలించింది మేడమ్ టుస్సాడ్స్ బృందం .


ABOUT THE AUTHOR

...view details