మహేశ్ బాబు కొత్త చిత్రం 'సరిలేరు నీకెవ్వరు' కశ్మీర్లో షూటింగ్ జరుపుకుంటోంది. రష్మిక మందణ్న హీరోయిన్గా నటిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల చేయాలని చిత్రబృందం ఆలోచిస్తోంది.
విజయశాంతి కీలకపాత్రను పోషిస్తోన్న ఈ సినిమా తర్వాతి షెడ్యూల్ను హైదరాబాద్లో చిత్రీకరిస్తారు. ఇందులో ప్రిన్స్ మేజర్ అజయ్కృష్ణ పాత్రలో నటించనున్నాడు.