తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'క్యాన్సర్​తోనే సల్మాన్​ సినిమా షూటింగ్​ చేశా' - mahesh manjrekar at antim trailer launch

ప్రముఖ నటుడు, దర్శకుడు మహేశ్​ మంజ్రేకర్​ క్యాన్సర్​ను జయించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆయన హర్షం వ్యక్తం చేశారు. హీరో సల్మాన్​ ఖాన్​తో ఆయన తెరకెక్కించిన 'అంతిమ్' చిత్రం త్వరలోనే విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది. చికిత్స తీసుకుంటూనే ఈ సినిమా షూటింగ్​ చేసినట్లు మహేశ్​ తెలిపారు.

antim
అంతిమ్​

By

Published : Oct 26, 2021, 1:56 PM IST

ప్రముఖ నటుడు, దర్శకుడు మహేశ్​ మంజ్రేకర్​ క్యాన్సర్​ బారి నుంచి కోలుకున్నారు. హీరో సల్మాన్​ఖాన్​తో ఆయన తాజాగా తెరకెక్కించిన చిత్రం 'అంతిమ్: ది ఫైనల్‌ ట్రూత్‌'​. ఈ సినిమా ట్రైలర్​ రిలీజ్​ వేడుకలోనే మహేశ్​ ఈ విషయాన్ని తెలిపారు.

మహేశ్​ మంజ్రేకర్​

"అంతిమ్​ చిత్ర షూటింగ్​ సమయంలో నేను క్యాన్సర్​ బారిన పడ్డాను. నాకు ఈ విషయం తెలియగానే షాక్​ అవ్వలేదు. దాన్ని అంగీకరించాను. చాలా మంది ఈ రోగంతో బాధపడుతున్నారు. దానితో పోరాడుతూ జీవనం సాగిస్తున్నారు. నా మీద అది పెద్దగా ప్రభావం చూపలేదు. కీమోథెరపీ చికిత్స తీసుకుంటూనే చిత్రీకరణను పూర్తి చేశాను. ఈరోజు రోగాన్ని జయించడం చాలా ఆనందంగా ఉంది."

-మహేశ్​ మంజ్రేకర్​, దర్శకుడు.

హిందీలో 'వాంటెడ్'​, 'రెడీ', 'ఓ మై గాడ్'​ సహా ఎన్నో చిత్రాల్లో నటించారు మంజ్రేకర్. 'వాస్తవ్', 'కురుక్షేత్ర', 'నటసామ్రాట్​' వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. తెలుగు తెరపైనా 'అదుర్స్'​, 'సాహో' వంటి చిత్రాల్లో కనిపించారు.

ఇదీ చూడండి: అతడిని కొట్టి, తిట్టిన నటుడు మహేశ్ మంజ్రేకర్

ABOUT THE AUTHOR

...view details