పుస్తక రచయిత, ఐఏయస్ అధికారి బుర్రా వెంకటేశం రచించిన 'సెల్ఫీ ఆఫ్ సక్సెస్' పుస్తకం ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఎందరో ప్రముఖులు ఈ పుస్తకంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అమెజాన్ ఆన్లైన్ బెస్ట్ సెల్లర్‌గా నిలిచిన ఈ పుస్తకంపై టాలీవుడ్ నటుడు మహేశ్ బాబు స్పందించాడు.
'సెల్ఫీ ఆఫ్ సక్సెస్'కు మహేశ్ కితాబు - burra venkatesham
టాలీవుడ్ హీరో మహేశ్ బాబు 'సెల్ఫీ ఆఫ్ సక్సెస్' అనే పుస్తకంపై ట్విట్టర్లో స్పందించాడు. రచయిత బుర్రా వెంకటేశంపై ప్రశంసలు కురిపించాడు.
సినిమా
ఈ పుస్తకం 'మహర్షి' చిత్ర థీమ్‌కు దగ్గరగా ఉందన్న మహేశ్.. రచయిత బుర్రా వెంకటేశంపై ప్రశంసలు కురిపించాడు. విజయానికి నిజమైన అర్థాన్ని చెబుతూ అనేక ఉదాహరణలు చూపిన పుస్తకమని కితాబిచ్చాడు. దీనిని ప్రతి ఒక్కరూ చదవాలని సూచించాడు. విజయం మనిషి జీవితంలోని ఒక ప్రయాణంగా ఉండాలంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.