తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఈ సారి సోలోగా రంగంలోకి దిగుతున్న మహేశ్​బాబు​​! - మహేశ్​బాబు ఏఎంబీ సినిమాస్​

నటుడిగానే కాకుండా థియేటర్ల​ రంగంలోనూ రాణిస్తున్న సూపర్​స్టార్ మహేశ్​బాబు.. త్వరలో  మరో అధునాతన మల్టీప్లెక్స్​ నిర్మించబోతున్నాడని టాక్. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఈ హీరో.. తన తర్వాతి చిత్రం దర్శకుడు వంశీ పైడపల్లితో చేయనున్నాడు.

Mahesh is now set to start another multiplex, this time in Bengaluru
మరో మల్టీప్లెక్స్ కట్టే ఆలోచనలో మహేశ్​బాబు​​!

By

Published : Jan 26, 2020, 11:40 AM IST

Updated : Feb 18, 2020, 11:05 AM IST

టాలీవుడ్​ హీరోగా, వ్యాపారవేత్తగా, నిర్మాతగా, పలు బ్రాండ్లకు ప్రచారకర్తగా ఇలా వివిధ రకాల పాత్రలు పోషిస్తున్నాడు సూపర్​స్టార్ మహేశ్​బాబు. కొంతకాలంగా తాను నటిస్తున్న సినిమాలకు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్న మహేశ్​.. అడివి శేష్​ ప్రధాన పాత్రలో 'మేజర్‌' అనే బయోపిక్‌ను నిర్మిస్తున్నాడు. డిజిటల్‌ రంగంలోనూ పలు వెబ్‌ సిరీస్‌లు నిర్మించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే థియేటర్ల రంగంలో ఉన్న మహేశ్​.. తాజాగా మరో అధునాతన మల్టీప్లెక్స్​ కట్టాలని భావిస్తున్నాడట.

మరో మల్టీప్లెక్స్ కట్టే ఆలోచనలో మహేశ్​బాబు​​!

మరో మల్టీప్లెక్స్‌

సినిమాకు అనుబంధ రంగమైన థియేటర్‌ వ్యాపారంలోనూ కొన్నేళ్ల క్రితమే అడుగుపెట్టాడు మహేశ్​బాబు. ప్రముఖ డిస్టిబ్యూషన్‌ సంస్థ ఏషియన్‌ సినిమాస్‌తో కలిసి హైదరాబాద్‌లో 'ఏఎంబీ సినిమాస్‌' పేరుతో భారీ మల్టీప్లెక్స్‌ను ఏర్పాటు చేశాడు. ఏడు స్క్రీన్స్‌తో దాదాపు 1600 మంది కూర్చొనే సామర్థ్యంతో దీనిని నిర్మించారు. అయితే ఇప్పుడు మహేశ్​బాబు ఒక్కడే.. బెంగళూరులో మరో మల్టీప్లెక్స్​ కట్టాలని భావిస్తున్నాడు.

మరో మల్టీప్లెక్స్ కట్టే ఆలోచనలో మహేశ్​బాబు​​!

వంశీ సినిమాలో స్పై రోల్

వంశీ పైడిపల్లితో తర్వాతి సినిమా చేయనున్నాడు మహేశ్​. మరో రెండు నెలల తర్వాత షూటింగ్ ప్రారంభం కానుంది. గూఢచారి పాత్రలో ఈ హీరో కనిపించనున్నాడని సమాచారం. ఇందులో ఇద్దరు హీరోయిన్లకు చోటుంది. వారి ఎంపికే ప్రస్తుతం జరుగుతోంది.

ఇదీ చదవండి: '83' సినిమాలో టీమిండియా క్రికెటర్లు వీరే

Last Updated : Feb 18, 2020, 11:05 AM IST

ABOUT THE AUTHOR

...view details