సూపర్‌స్టార్ మహేశ్ బాబు ముద్దుల కూతురు సితార. చిన్న వయసులోనే ముద్దు మాటలతో, చలాకీతనంతో ఆకట్టుకుంది. ఆమెకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నమ్రత ఎప్పటికప్పుడూ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అలాంటి వీడియోనే మహేశ్ ట్విట్టర్లో పంచుకున్నారు. దీనికి అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
బాహుబలి పాటకు 'సితార' డ్యాన్స్ - సితార డ్యాన్స్ వీడియో
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు గారాలపట్టి సితార...బాహుబలి పాటకు నృత్యం చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
![బాహుబలి పాటకు 'సితార' డ్యాన్స్](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2742508-860-e9e3bf38-11ec-48df-89e3-0c4c5be8a732.jpg)
బాహుబలి పాటకు 'సితార' డ్యాన్స్
బాహుబలి సినిమాలో 'కన్నా నిదురించరా'... అంటూ సాగే గీతానికి అద్భుతంగా డ్యాన్స్ చేసి ఆకట్టుకుంది సితార. ప్రముఖ సంప్రదాయ నృత్య శిక్షకురాలు అరుణ భిక్షు దగ్గర డాన్స్ నేర్చుకుంటోందీ చిన్నారి.