'మహేశ్... ఆ పేరులో మత్తుంది, ఆ పేరులో వైబ్రేషన్స్ ఉన్నాయి'.. ఇది ఒక తెలుగు సినిమాలోని డైలాగ్ కావొచ్చు, కానీ ఇదొక్కటి చాలు మహేశ్‌బాబు క్రేజ్ ఏంటో చెప్పడానికి. తనదైన మేనరిజం, నటన, డ్యాన్స్‌తో ప్రేక్షకుల్ని మెప్పించిన ప్రిన్స్.. ప్రస్తుతం టాలీవుడ్లో అగ్రహీరోల్లో ఒకడిగా కొనసాగుతున్నాడు. ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లవుతున్నా తన గ్లామర్‌తో కుర్రహీరోలకు పోటీ ఇస్తున్నాడు.నేడు 44 వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా సూపర్‌స్టార్‌పై ప్రత్యేక కథనం.
కుటుంబ నేపథ్యం
సూపర్ స్టార్ కృష్ణ నాలుగో సంతానం మహేశ్ బాబు. ప్రిన్స్‌కు ఇద్దరు అక్కలు, ఒక అన్నయ్య ఉన్నారు. మహేశ్‌కు ప్రియదర్శని అనే చెల్లెలు ఉంది. ఈమె భర్తే నటుడు సుధీర్‌బాబు. అమ్మమ్మ దుర్గమ్మ దగ్గర పెరిగిన ప్రిన్స్ చదువంతా మద్రాస్‌లో సాగింది. అక్కడి లయోలా కాలేజ్‌లో కామర్స్ విభాగంలో డిగ్రీ పట్టా పొందాడు.
బాలనటుడిగా అరంగేట్రం
బాల నటుడిగా సినిమాల్లోకి అరంగేట్రం చేశాడు మహేశ్‌బాబు. ఆ వయసులోనే తనదైన శైలి నటనతో మెప్పించాడు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా మొదటి సినిమా ‘నీడ’. ఓ పక్క చదువుకుంటూనే మరోపక్క సినిమాల్లో నటించాడు. ‘పోరాటం’, ‘శంఖారావం’, ‘బజారు రౌడీ’, ‘గూఢచారి 117’, ‘కొడుకు దిద్దిన కాపురం’, ‘బాలచంద్రుడు’ చిత్రాలతో ప్రేక్షకులను కట్టిపడేశాడు.
సినీ ప్రస్థానం
1999లో ‘రాజకుమారుడు’తో హీరోగా తెరంగేట్రం చేశాడు మహేశ్‌బాబు. ఆ తర్వాత ‘యువరాజు’, ‘వంశీ’, ‘మురారి’, ‘టక్కరి దొంగ’, ‘బాబీ’, ‘ఒక్కడు’, ‘నిజం’, ‘నాని’, ‘అర్జున్’, ‘అతడు’, ‘పోకిరి’, ‘సైనికుడు’, ‘అతిథి’, ‘ఖలేజా’, ‘దూకుడు’, ‘బిజినెస్‌మెన్’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘వన్ నేనొక్కడినే’, ‘ఆగడు’, ‘శ్రీమంతుడు’, ‘బ్రహ్మోత్సవం’, ‘స్పైడర్’, ‘భరత్ అనే నేను’, ‘మహర్షి’ సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో బిజీగా ఉన్నాడు.
విభిన్న పాత్రల్లో మెరిసిన ప్రిన్స్