సూపర్‌స్టార్ కృష్ణ తనయుడిగా సినీరంగ ప్రవేశం చేసిన నటుడు మహేశ్‌బాబు. ఇతడు తొలిసారి 'రాజకుమారుడు' చిత్రంలో హీరోగా చేసి, ప్రేక్షకులను మెప్పించారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తీసిన సినిమా నేటికి 21 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ట్వీట్ చేసిన మహేశ్.. డైరెక్టర్ రాఘవేంద్రరావుకు ధన్యవాదాలు తెలిపారు. ఆ జ్ఞాపకాల్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటానని అన్నారు.
వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వనీదత్ ఈ సినిమాను నిర్మించగా, ప్రీతిజింటా హీరోయిన్గా నటించింది. పరుచూరి బ్రదర్స్ రాసిన డైలాగ్‌లు చిత్రానికి కొత్తహంగులు తీసుకొచ్చాయి. మణిశర్మ సంగీతం ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత ఎన్నో సినిమాల్లో నటించిన మహేశ్.. అమ్మాయిల కలల రాకుమారుడిగా వారి గుండెల్లో స్థానం సంపాదించారు.