పులి.. కుందేలు కథ చెబుతూ 'సర్కారు వారి పాట'(Sarkaru Vaari Paata) బ్లాస్టర్‌తో హీరో మహేశ్ బాబు(Mahesh Babu) చేసిన సందడి అంతా ఇంతా కాదు. అదే తరహాలో మహేశ్ మరోసారి విలన్లతో ఓ ఆట ఆడుకున్నారు. మరి ఆ ఆట ఎలా సాగిందో తెలియాలంటే మాత్రం 'సర్కారు వారి పాట' విడుదలయ్యే వరకు ఎదురు చూడాల్సిందేనని చిత్రబృందం అంటోంది.
ఈ సినిమాకు సంబంధించిన కీలక యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించేందుకు గోవా చేరుకున్న చిత్రయూనిట్.. బుధవారంతో షెడ్యూల్ పూర్తి చేసుకొని హైదరాబాద్ తిరిగి వచ్చింది. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఓ సెట్‌లో.. రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో ఆ పోరాట ఘట్టాన్ని తెరకెక్కించారు.