సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, రష్మిక మందణ్న కలిసి నటిస్తోన్న 'సరిలేరు నీకెవ్వరు'... శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటుంది. ఈ చిత్రంలో... సీనియర్ కథానాయిక విజయశాంతి ఓ కీలక పాత్ర పోషిస్తోంది. చాలా ఏళ్ల విరామం తర్వాత వెండితెరపై ఆమె రీఎంట్రీ ఇవ్వబోతోంది. ఇప్పటివరకు ఈ లేడీ స్టార్ లుక్, పాత్ర గురించి ఎటువంటి విశేషాలు వెల్లడించలేదు చిత్రబృందం. కానీ దీపావళి కానుకగా ఆమె పోస్టర్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించాడు దర్శకుడు అనిల్ రావిపూడి.
'సరిలేరు నీకెవ్వరు' అదిరే సర్ప్రైజ్ ఆ రోజే...! - Mahesh Babu's Sarileru Neekevvaru team will give surprise on diwali
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్‌బాబు కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. రష్మిక మందణ్న కథానాయిక. ఈ సినిమా నుంచి ఓ సర్ప్రైజ్ను దీపావళి కానుకగా విడుదల చేయనుంది చిత్రబృందం.
" సరిలేరు నీకెవ్వరు నుంచి దీపావళి కానుక కోసం సిద్ధంగా ఉండండి. శనివారం ఉదయం 9.09 గంటలకు విజయశాంతిగారి పాత్రను పరిచయం చేస్తూ పోస్టర్‌ను అభిమానులతో పంచుకుంటాం. అదే రోజు సాయంత్రం 5.04 గంటలకు మహేశ్‌బాబు కొత్త లుక్ విడుదల చేస్తాం".
-అనిల్ రావిపూడి, దర్శకుడు
ఈ సినిమాలో ఆర్మీ అధికారి మేజర్ అజయ్ కృష్ణగా కనిపించనున్నాడు మహేశ్. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నాడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జి.మహేశ్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై... రామబ్రహ్మం సుంకర, దిల్‌రాజు, మహేశ్‌బాబులు నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న సినిమా విడుదలకానుంది.