'సరిలేరు నీకెవ్వరు' విజయంతో దూకుడు మీదున్నారు స్టార్హీరో మహేశ్‌బాబు. అదే వేగంతో తన తర్వాతి చిత్రం 'సర్కారువారి పాట'(sarkaru vaari paata) పూర్తి చేద్దామనుకున్నా, ఆ స్పీడ్‌కు కరోనా(coronavirus) బ్రేక్‌లు వేసింది. ప్రస్తుతం షూటింగ్‌లకు ఎలాంటి ఇబ్బందులు లేకపోవడం వల్ల ఈ సినిమా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారట. దర్శకుడు పరుశురామ్ వర్కింగ్ స్టైల్ కూడా అదే కావడం వల్ల సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోందట.
'సరిలేరు నీకెవ్వరు' తర్వాత గ్యాప్ వచ్చినట్లు ఈ సారి రాకుండా చూసుకుందామని మహేశ్(mahesh sarkari vari pata) ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. 'సర్కారు వారి పాట' పూర్తి చేసి, విరామం తీసుకోకుండా వెంటనే త్రివిక్రమ్(trivikram mahesh movie) క్యాంప్‌లోకి అడుగుపెట్టాలని యోచిస్తున్నారు. అన్నీ కుదిరితే నవంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ షురూ కానున్నట్లు తెలుస్తోంది.