టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు సినిమా విడుదలైందంటే చాలు అతని అభిమానుల సందడే వేరు. థియేటర్‌కు వచ్చిన ఒక్కో చిత్రం కనీసం 100 కోట్లను వసూలు చేసి కానీ తిరిగి వెళ్లదు. అలాంటి మహేశ్ మెచ్చిన చిత్రం.. అది కూడా అతడ్ని భయపెట్టిన సినిమా ఏంటో తెలుసా?.
మహేశ్‌బాబును భయపెట్టిన హారర్ సినిమా ఇదే - మహేశ్ బాబు సినిమా వార్తలు
సూపర్‌స్టార్ మహేశ్‌బాబును 'ది సోషల్ డైలమా' అనే హారర్ చిత్రం ఎంతగానో భయపెట్టిందట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా తెలిపారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చూడాల్సిన సినిమా అని చెప్పారు.
![మహేశ్‌బాబును భయపెట్టిన హారర్ సినిమా ఇదే Mahesh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9075289-745-9075289-1601993875605.jpg)
ఇటీవల కాలంలో తనను ఎంతగానో భయపెట్టిన చిత్రం 'ది సోషల్ డైలమా' అని మహేశ్ ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. "ఒక ప్రేక్షకుడిగా, అభిమానిగా నేను ఎన్నో చిత్రాలను చూశా. కానీ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన 'ది సోషల్ డైలమా' నన్ను ఎంతగానో భయపెట్టింది. ఇప్పుడు కూడా ఆ సినిమా నాలో వణుకు పుట్టిస్తోంది. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా." అని మహేశ్ ట్విట్టర్లో రాసుకొచ్చాడు.
వాస్తవానికి ఈ సినిమా హారర్ నేపథ్యంలో తెరక్కింది కాదు. సామాజిక మాధ్యమాల వెబ్సైట్ల వల్ల సంభవించే ప్రమాదాల గురించి అవగాహన కల్పిస్తూ ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.