మహేశ్ బాబును చూస్తే ఇప్పటికీ కాలేజీ విద్యార్థిగానే కనిపిస్తుంటారు. ఈతరం అమ్మాయిల కలల రాకుమారుడిగా కవ్విస్తుంటారు. అలాంటి మహేశ్, పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఈ చిత్రంలో మహేశ్.. కాలేజీ విద్యార్థిగా నటించనున్నారని చెప్పుకుంటున్నారు. పరశురామ్ కూడా సినిమా కోసం తీవ్రంగా కసరత్తులు చేస్తున్నారట.
మరోసారి కాలేజీ విద్యార్థిగా మహేశ్! - మరోసారి కాలేజీ విద్యార్థిగా మహేశ్!
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు.. పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ చిత్రంలో మహేశ్ కాలేజీ విద్యార్థిగా నటించనున్నారని తెలుస్తోంది.
మహేశ్
ఇప్పటికే 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను', 'మహర్షి' చిత్రాల్లో మహేశ్ బాబు కాలేజీ విద్యార్థిగా నటించారు. ఇక దర్శకుడు పరశురామ్‌కు ప్రేమకథలు బాగా తెరకెక్కించగలరనే పేరు కూడా ఉంది. లాక్‌డౌన్ పూర్తికాగానే సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉందని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.