'సర్కారు వారి పాట' సినిమా షూటింగ్లో తీరిక లేకుండా గడుపుతున్నారు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఈ మూవీ సెట్స్‌పై ఉండగానే.. మహేశ్‌తో ప్రాజెక్టు ఒప్పందానికి డైరెక్టర్లు క్యూ కడుతున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ 28వ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనుందని ప్రకటన వచ్చేసింది. తాజాగా.. ప్రిన్స్‌తో సినిమాపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కూడా క్లారిటీ ఇచ్చారు. సూపర్ స్టార్‌తో తప్పకుండా మూవీ ఉంటుందని.. ఇప్పటికే స్టోరీ లైన్ కూడా వివరించినట్లు తెలిపారు.
మహేశ్‌తో సినిమాపై సందీప్ వంగా క్లారిటీ! - మహేశ్ బాబు కొత్త సినిమా
సందీప్ రెడ్డి దర్శకత్వంలో మహేశ్ బాబు కథానాయకునిగా సినిమా రానుందా? అంటే అవుననే చెప్పాలి. సూపర్ స్టార్‌తో సినిమా తీయనున్నట్లు సందీప్ రెడ్డి వెల్లడించారు.
సందీప్ రెడ్డి- మహేశ్ బాబు కాంబినేషన్లో సినిమా రానుందని గతంలోనే ఊహాగానాలు వచ్చినా.. అవి కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం సమయం ఆసన్నమైందని సందీప్ రెడ్డి చెప్పారు. ఓ కొత్త సబ్జెక్ట్‌తో సూపర్ స్టార్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తానని వెల్లడించారు. తాను వివరించిన కథపై మహేశ్ సానుకూలంగానే ఉన్నారని తెలిపారు. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఏ రేంజ్లో ఉంటుందోనని అభిమానులు చర్చించుకుంటున్నారు.
ఇదీ చదవండి:'అల్లు అర్జున్ నా క్రష్.. ఆ వార్తలు చూసి నవ్వుకుంటా'