తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మహేశ్‌ మోకాలికి త్వరలో శస్త్ర చికిత్స.. సినిమాలకు బ్రేక్​! - Mahesh Babu to take a break for three months

ప్రిన్స్​​ మహేశ్​బాబు ఇటీవల 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో ఘన విజయాన్ని అందుకున్నాడు. అయితే ఈ స్టార్​ హీరో తర్వాతి ప్రాజెక్టు మొదలుపెట్టడానికి కాస్త సమయం పట్టేలా ఉంది. సూపర్​స్టార్ చాలా రోజులుగా మోకాలి నొప్పితో బాధపడుతున్నాడట. ఇందుకు శస్త్రచికిత్స అవసరమని వైద్యులు సూచించడం వల్ల మూడు నెలలు సినిమాలకు బ్రేక్​ చెప్పే యోచనలో ఉన్నాడట మహేశ్​.

Mahesh Babu to take a break for three months after Sarileru Neekevvaru for leg operation?
మహేశ్‌ మోకాలికి శస్త్ర చికిత్స.. సినిమాలకు బ్రేక్​!

By

Published : Jan 26, 2020, 8:41 PM IST

Updated : Feb 28, 2020, 1:46 AM IST

'సరిలేరు నీకెవ్వరు' విజయంతో జోరుమీదున్న అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు.. తర్వాతి సినిమా మొదలుపెట్టడానికి కాస్త సమయం తీసుకోనున్నట్లు సమాచారం.

ఏమైంది...?

'ఆగడు' షూటింగ్‌ సందర్భంగా ప్రిన్స్​ మోకాలికి దెబ్బ తగలడం వల్ల కొంతకాలం కిందట శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. అయితే, వరుస షూటింగ్‌ల కారణంగా నొప్పి మళ్లీ తిరగబెట్టగా... అతడు మరోసారి సర్జరీ చేయించుకోవాలని యోచిస్తున్నాడట.

" ఆగడు సినిమాలోని టైటిల్‌ సాంగ్‌ చిత్రీకరణ సందర్భంగా మహేశ్‌ మోకాలికి దెబ్బ తగలింది. అప్పుడు కొంత విశ్రాంతి తీసుకుని షూటింగ్‌ పూర్తి చేశారు. 'స్పైడర్‌' తర్వాత శస్త్ర చికిత్స చేయించుకున్నారు. కానీ వరుస షూటింగ్‌ల కారణంగా నొప్పి మళ్లీ మొదలైంది. తాజాగా 'సరిలేరు నీకెవ్వరు' ప్రమోషన్స్‌ కూడా పూర్తయ్యాయి. ఈ సమయంలో అమెరికాలో సర్జరీ చేయించుకుని, కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నారు. ఇందుకోసమేత్వరలో మహేశ్‌ కుటుంబం మూడు నెలల న్యూయార్క్‌ పర్యటనకు వెళ్లనుంది".

-- మహేశ్​ సన్నిహిత వర్గాలు

ఈ విషయాలపై ప్రిన్స్​, అతడి కుటుంబ సభ్యులు అధికారికంగా స్పందించాల్సి ఉంది. 'సరిలేరు నీకెవ్వరు' తర్వాత మహేశ్‌బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించనున్నాడు. జేమ్స్‌బాండ్‌ తరహా కథతో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. మహేశ్‌ అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి...

ఈ సారి సోలోగా రంగంలోకి దిగుతున్న మహేశ్​బాబు​​!

Last Updated : Feb 28, 2020, 1:46 AM IST

ABOUT THE AUTHOR

...view details