కరోనా వల్ల సినీరంగం ఈ ఏడాది కుదేలైంది. వచ్చే ఏడాది అంతా బాగుండాలని ఆశిస్తున్నట్లు చెబుతూ పలువురు సినీ ప్రముఖులు, అభిమానులకు క్రిస్మస్ శుభాకాంక్షలు చెబుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఫొటోల్ని పోస్ట్ చేస్తున్నారు. ఈ అందమైన రోజున అందరి జీవితాల్లో సంతోషాలు నిండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
క్రిస్మస్తో మన జీవితాల్లో నవ్వులు, సంతోషం నిండుతుందని ఆశిస్తున్నానని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. రాబోయే ఏడాది గొప్పగా ఉంటుందని చెబుతూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.