సూపర్‌స్టార్ మహేశ్‌బాబు(Mahesh babu).. ఆరు నెలల్లో తన రెండు సినిమాలను థియేటర్లలోకి తీసుకొచ్చేలా కనిపిస్తున్నారు. ప్రస్తుతం 'సర్కారు వారి పాట'తో(sarkaru vaari paata) బిజీగా ఉన్న ప్రిన్స్.. చిత్రబృందానికి త్వరలో వ్యాక్సిన్ వేయించనున్నారు. ఇది పూర్తయిన తర్వాత జులై నుంచి షూటింగ్లో తిరిగి పాల్గొంటారు. అక్టోబరులో కల్లా దానిని ముగించి, త్రివిక్రమ్‌తో కలిసి పనిచేస్తారు.
త్రివిక్రమ్-మహేశ్ కాంబినేషన్ అంటే సినీ అభిమానుల్లో ఎనలేని ఆసక్తి. వారిద్దరూ ఇంతకు ముందు చేసిన అతడు(Athadu), ఖలేజా(Khaleja) చిత్రాలు థియేటర్లలో సరిగా ఆడకపోయినప్పటికీ.. ఆ తర్వాత అభిమానుల దృష్టిలో కల్ట్ క్లాసిక్స్‌గా నిలిచిపోయాయి. మరి ఇప్పుడు రాబోతున్న చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి.