తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఒకే స్టేజ్‌పై మహేశ్‌- ఎన్టీఆర్‌.. ఎప్పుడంటే? - ఎవరు మీలో కోటీశ్వరులు

మహేశ్​ బాబు, ఎన్టీఆర్ కలిసి ఒకే స్టేజ్​పై కనువిందు చేస్తే.. ఒక్కసారి ఊహించుకోండి. ఆ కిక్కే వేరు కదా. అవును ఎన్టీఆర్ హోస్ట్​గా వ్యవహరిస్తున్న 'ఎవరు మీలో కోటీశ్వరులు' ప్రోగ్రాంలో మహేశ్​.. స్పెషల్ గెస్ట్​గా ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. దసరా కానుకగా ఈ స్పెషల్ ఎపిసోడ్ ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది.

mahesh, NTR
మహేశ్, ఎన్టీఆర్

By

Published : Sep 19, 2021, 12:51 PM IST

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఒకే స్టేజ్‌పై సందడి చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ స్పెషల్‌ ఎపిసోడ్‌కు ప్రముఖ ఛానల్‌ భారీగా ప్లాన్‌ చేసినట్లు సమాచారం. 'ఆట నాది.. కోటి మీది'అంటూ బుల్లితెర ప్రేక్షకులకు వ్యాఖ్యాతగా మరింత చేరువయ్యారు తారక్‌. ఆయన హోస్ట్‌గా వ్యవహరిస్తున్న గేమ్‌ షో 'ఎవరు మీలో కోటీశ్వరులు'.

బుల్లితెర వేదికగా ప్రముఖ ఛానల్‌లో ఇటీవల ప్రారంభమైన ఈ షో సామాన్యులకు ఎంతో చేరువైంది. ఈ షో ప్రారంభ ఎపిసోడ్‌లో రామ్‌చరణ్‌ సందడి చేయగా.. సోమవారం ప్రసారమయ్యే ఎపిసోడ్‌లో రాజమౌళి, కొరటాల శివ తమ ఆటతో మెప్పించనున్నారు. దసరా కానుకగా ప్రసారం కానున్న 'ఎవరు మీలో కోటీశ్వరులు' కార్యక్రమంలో మహేశ్‌బాబు స్పెషల్‌గెస్ట్‌గా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ షోలో పాల్గొనేందుకు మహేశ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని.. త్వరలోనే ఈ ఎపిసోడ్‌ షూట్‌ జరగనుందని సమాచారం. ఈ వార్తలపై ఇప్పటికే నెటిజన్లు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, వీరిద్దరి కాంబినేషన్‌లో షో వస్తే.. ఇక టీఆర్పీల పరంగా రికార్డుల మోత మోగాల్సిందే.

ఇదీ చదవండి:ఆ పుస్తకం మహేశ్​బాబును సిగరెట్​ మాన్పించిందట!

ABOUT THE AUTHOR

...view details