తారాలోకం@సామాజిక మాధ్యమాలు - మహేశ్ బాబు జిమ్ వర్కవుట్
లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన సినీ తారలు ఇంట్లో తాము చేసే పనులు, ఆనాటి జ్ఞాపకాలను సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా మన తారలు ఎలాంటి పోస్టులు చేశారో చూద్దామా.
సూపర్‌స్టార్ మహేశ్ కొత్త సినిమా కోసం కసరత్తులు మొదలు పెట్టారు. కథానాయిక సమంత సరికొత్తగా సందడి చేస్తోంది. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనతో కలిసి చిరంజీవి నటించిన చిత్రంలోని అరుదైన చిత్రాన్ని రామ్‌చరణ్ అభిమానులతో పంచుకున్నారు. మహిళల్లో రుతస్రావం, అవగాహన తదితర అంశాలపై మాట్లాడమంటే ఎవరూ ముందుకు రారు. కానీ, నటి, యాంకర్ అనసూయ ఇన్‌స్టా వేదికగా మాట్లాడి అవగాహన కల్పించారు. లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన మన తారలు ఇంట్లో తాము చేసే పనులు, ఆనాటి జ్ఞాపకాలు, వివిధ అంశాలపై సామాజిక మాధ్యమాల వేదికగా స్పందిస్తూ, అభిమానులకు చేరువగా ఉంటున్నారు. మరి తాజాగా మన తారలు పంచుకున్న విశేషాలు ఏంటో చూద్దామా!