తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సర్కారు వారి పాట': మహేశ్ హంగామా షురూ - సర్కారు వారి పాట వార్తలు

హీరో మహేశ్​బాబు నటిస్తున్న 'సర్కారు వారి పాట' మోషన్ పోస్టర్ విడుదలైంది. బ్యాంకుల ఎగవేతకు సంబంధించిన కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

'సర్కారు వారి పాట': సూపర్​స్టార్ మహేశ్ హంగామా షురూ
సర్కారు వారి పాట మోషన్ పోస్టర్

By

Published : Aug 9, 2020, 9:22 AM IST

'సర్కారు వారి పాట' మోషన్ పోస్టర్ వచ్చేసింది. సూపర్​స్టార్ మహేశ్​బాబు పుట్టినరోజు సందర్భంగా దీనిని విడుదల చేశారు. ఇందులో మాస్​గా కనిపించనున్నారు మహేశ్. మణికట్టుకు 'ఓం' లాకెట్, రూపాయి బిళ్లను పైకి ఎగురేస్తున్న అతడి​ చేతిని మాత్రమే ఇందులో చూపించారు.

ఈ సినిమాలో కీర్తి సురేశ్ హీరోయిన్​గా నటించనుంది. తమన్ సంగీత దర్శకుడు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ ఎంటర్​టైన్​మెంట్స్, జీఎమ్​బీ ఎంటర్​టైన్​మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది వేసవికి ఈ చిత్రం వచ్చే అవకాశముంది.

ABOUT THE AUTHOR

...view details