సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా.. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'సర్కారు వారి పాట'. ఈ సినిమా తొలి షెడ్యూల్ కోసం చిత్రబృందం అమెరికా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అయితే డిసెంబర్లో చిత్రీకరణకు ప్రణాళిక రచిస్తున్నారట దర్శకనిర్మాతలు.
అమెరికాలో 'సర్కారు వారి పాట' షూటింగ్..?
కరోనా తర్వాత టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు సినిమా షూటింగ్‌ల్లో పాల్గొనేందుకు మరింత సమయం పట్టేలా ఉంది. ఆయన నటిస్తున్న 'సర్కారు వారి పాట' చిత్రీకరణ కోసం అమెరికా వెళ్లనున్నట్లు సమాచారం. అయితే డిసెంబరులో ఈ షెడ్యూల్ ఉంటుందని తెలుస్తోంది.
మహేశ్
అగ్రరాజ్యంలోనే నెలరోజుల పాటు షూటింగ్ కొనసాగనుందట. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది వేసవికి సినిమాను విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్లు సమాచారం.
మైత్రీ మూవీ మేకర్స్, 14రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా 'సర్కారు వారి పాట'ను నిర్మిస్తున్నాయి. ఇటీవలే విడుదలైన మోషన్ పోస్టర్‌తో.. సినిమాపై అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. అందులో మహేష్ గడ్డంతో కూడిన మాస్‌లుక్‌లో కనిపించారు. కీర్తి సురేష్ హీరోయిన్. తమన్ సంగీత దర్శకుడు