సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ప్రస్తుతం 'సర్కారు వారి పాట' సినిమా చేస్తున్నారు. తొలి షెడ్యూల్ ఇప్పటికీ పూర్తవగా, రెండో షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభించాలనే సమయానికి కరోనా రూపంలో ఆటంకం ఏర్పడింది. ఈ మధ్య కాలంలో కొవిడ్ తీవ్రత తగ్గుతున్న నేపథ్యంలో, త్వరలో చిత్రీకరణ తిరిగి ప్రారంభించాలని చిత్రబృందం భావిస్తోంది. అయితే ఇందుకోసం మహేశ్‌బాబు సూపర్‌ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే తను దత్తత తీసుకున్న గ్రామాల్లో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టిన మహేశ్.. ఇప్పుడు 'సర్కారు వారి పాట' చిత్రబృందం మొత్తానికి టీకా వేయించాలని అనుకుంటున్నారట. ఇది పూర్తయితే జులై నుంచి షూటింగ్ మొదలయ్యే అవకాశముందని టాక్.