తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సర్కారు వారి పాట' క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్​కు పండగే! - సర్కారు వారి పాట

Sarkaru Vaari Paata Songs: సూపర్​స్టార్ మహేశ్ బాబు నటిస్తోన్న 'సర్కారు వారి పాట'కు సంబంధించి అదిరిపోయే అప్డేట్​ ఇచ్చారు సంగీత దర్శకుడు ఎస్ తమన్. ఈ సినిమా మ్యూజిక్​ వర్క్​ జరుగుతోందని, త్వరలోనే దానిని ప్రేక్షకులకు వినిపించడం కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.

sarkaru vaari paata
మహేశ్ బాబు

By

Published : Jan 6, 2022, 3:57 PM IST

Sarkaru Vaari Paata Songs: సూపర్​స్టార్​ మహేశ్ బాబు ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్​ చెప్పారు మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ తమన్. త్వరలోనే 'సర్కారు వారి పాట' మ్యూజిక్ విడుదలకాబోతోందని తెలిపారు. ఈ మేరకు దర్శకుడు పరశురామ్​తో కలిసి పనిచేస్తున్న ఓ ఫొటోను ట్విట్టర్​లో పెట్టారు.

"మేము మీరు (ప్రేక్షకులు) చెప్పింది విన్నాం. వింటూనే ఉన్నాం. త్వరలోనే మీరు.. మా నుంచి వినబోతున్నారు" అని తమన్ ట్వీట్ చేశారు. మహేశ్​ బాబు కోసం దర్శకుడు చాలా బాగా పనిచేశారని తమన్ అన్నారు. 'సర్కారు వారి పాట' ఆల్బమ్​ను త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ఎంతో శ్రమిస్తున్నట్లు తెలిపారు.

తమన్, మహేశ్

ఇక సంక్రాంతి నుంచి సినిమాకు సంబంధించి వరుస అప్డేట్లు ఉంటాయని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్​ వెల్లడించింది. బ్యాంక్​ రుణాల ఎగవేత నేపథ్య కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో మహేశ్​కు జోడీగా కీర్తి సురేశ్(keerthy suresh movies) నటిస్తోంది. సినిమాను ఏప్రిల్​ 1న విడుదల చేయనున్నారు.

ఇదీ చూడండి:త్రివిక్రమ్​తో మహేశ్​.. హ్యాట్రిక్ సినిమా షూటింగ్ త్వరలో

ABOUT THE AUTHOR

...view details