తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రికార్డులతో దూసుకెళ్తోన్న 'సర్కారు వారి పాట' ప్రీలుక్ - మహేశ్ బాబు సర్కార్ వారి పాట వార్తలు

సూపర్​స్టార్ మహేశ్​బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. దీనికి సంబంధించిన టైటిల్, ప్రీలుక్​ను ఆదివారం విడుదల చేసింది చిత్రబృందం.

మహేశ్
మహేశ్

By

Published : Jun 1, 2020, 4:12 PM IST

Updated : Jun 1, 2020, 4:29 PM IST

తెలుగు కథానాయకుడు మహేశ్ బాబు, పరశురామ్‌ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం 'సర్కారు వారి పాట'. మే 31న కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీలుక్‌ పోస్టర్​ను విడుదల చేశారు. పోస్టర్లో మహేశ్ బాబు మాస్‌లుక్‌తో ఆకట్టుకునేలా ఉన్నారు. కుడి చెవికి పోగు పెట్టుకుని, మెడపై ఇండియన్‌ రూపాయి నాణెం పచ్చబొట్టు వేసుకున్నారు. మాస్‌గా కనిపించే గడ్డంతో వైవిధ్యంగా కనిపించారు ప్రిన్స్.

మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రీలుక్‌ పోస్టర్‌ విడుదలై సామాజిక మాధ్యమాల్లో రికార్డులు సృష్టిస్తోంది. 24 గంటల్లో ఎక్కువగా లైక్‌లు, రీట్వీట్​ చేసిన ప్రీలుక్​గా, అత్యధికంగా ట్వీట్‌ చేసిన టైటిల్ ట్యాగ్‌గా నెట్టింట దూసుకుపోతోంది.

సర్కారు వారి పాట

ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తుండగా, పీఎస్‌ వినోద్‌ కెమెరామెన్‌గా, ఎడిటర్‌గా మార్తాండ్‌.కె వెంకటేష్‌లు పనిచేయనున్నారు. కియరా అడ్వాణీ ఇందులో కథానాయికగా నటించనుందని సమాచారం. త్వరలోనే సినిమా గురించి మరిన్ని వివరాలు తెలియనున్నాయి.

Last Updated : Jun 1, 2020, 4:29 PM IST

ABOUT THE AUTHOR

...view details