ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన సూపర్‌స్టార్ మహేశ్‌బాబు 'సరిలేరు నీకెవ్వరు'.. థియేటర్లలో అద్భుతమైన కలెక్షన్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.100 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి, మహేశ్ స్టామినా నిరూపించింది. ఇప్పుడు బుల్లితెరపైనా అదే స్థాయిలో సత్తా చాటింది. గత 15 ఏళ్లలో లేని విధంగా అదిరిపోయే రేటింగ్స్ సంపాదించింది.
దద్దరిల్లిన 'సరిలేరు నీకెవ్వరు' టీవీ రేటింగ్స్ - entertainment news
ఇటీవలే టీవీలో ప్రసారమైన 'సరిలేరు నీకెవ్వరు'.. అదిరిపోయే రేటింగ్స్ తెచ్చుకుంది. బుల్లితెరపై 'బాహుబలి' రికార్డులను అధిగమించింది.
మహేశ్‌బాబు సరిలేరు నీకెవ్వరు
ఈ ఉగాదికి, ఓ ప్రముఖ ఛానెల్లో ప్రసారమైన 'సరిలేరు నీకెవ్వరు'.. బార్క్ వివరాల ప్రకారం 23.4 టీవీఆర్ తెచ్చుకుంది. ఇంతకుముందు బాహుబలి-2(22.70), బాహుబలి(21.84) సినిమాలు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. అయితే తమ చిత్రంపై ఇంత ఆదరణ చూపిన ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పారు నిర్మాత అనిల్ సుంకర.