'ఉప్పెన' చిత్రానికి సంబంధించి ఓ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నారు టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు. ఇప్పటికే విడుదలైన నీ కన్ను నీలి సముద్రం, ధక్ ధక్ ధక్ పాటలు విశేష ఆదరణ పొందాయి. మరో పాటను సంగీత ప్రపంచంలోకి తీసుకురాబోతున్నారు మహేశ్. శ్రీమణి రచించిన రంగులద్దుకున్న గీతాన్ని నవంబరు 11న సాయంత్రం 4:05గంటలకు విడుదల చేయనున్నారు.
'ఉప్పెన' సర్‌ప్రైజ్ ఇవ్వనున్న మహేశ్ - uppena surprise mahesh
'ఉప్పెన' సినిమాలోని మరో పాటను సూపర్‌స్టార్ మహేశ్ బాబు విడుదల చేయనున్నారు. నవంబరు 11న సాయంత్రం ఈ పాట రిలీజ్ కానుంది.
మరి ఈ పాట ఎలా అలరిస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ప్రముఖ దర్శకుడు సుకుమార్ రచనా సహకారం అందించిన ఈ చిత్రం వేసవిలోనే విడుదల కావాల్సి ఉన్నా లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. ఎప్పుడు విడుదల చేస్తారో ఇంకా స్పష్టత ఇవ్వలేదు చిత్రబృందం. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి ఇందులో హీరోహీరోయిన్లుగా నటించారు. బుచ్చిబాబు దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు.
ఇదీ చూడండి ఈ జంట చిందేస్తే.. సినిమా సూపర్ హిట్!