తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అన్నకు మహేశ్​ కన్నీటి వీడ్కోలు.. వాట్సాప్​ వీడియో కాల్​లో! - mahesh babu brother ramesh babu

Mahesh Babu: కరోనా కారణంగా రమేశ్ బాబు కడపటి చూపునకు దూరంగా ఉన్నారు నటుడు మహేశ్ బాబు. ట్విట్టర్​ వేదికగా అన్నతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని భావోద్వేగానికి లోనయ్యారు.

mahesh babu
ramesh babu

By

Published : Jan 9, 2022, 3:06 PM IST

Mahesh Babu: కొవిడ్ కారణంగా సోదరుడు రమేశ్ బాబు కడచూపునకు మహేశ్ బాబు దూరమయ్యారు. తనతోపాటు తన పిల్లలు కూడా రమేశ్ బాబుకు అంతిమ వీడ్కోలు పలకలేకపోయారు. అయితే ఇంటి నుంచే వాట్సాప్​ కాల్​ ద్వారా అన్నను కడసారి చూసి కన్నీటి వీడ్కోలు పలికినట్లు తెలుస్తోంది. సోదరుడు రమేశ్ హఠాన్మరణం పట్ల ఎంతో భావోద్వేగానికి గురైన మహేశ్.. ట్విట్టర్ వేదికగా రమేశ్ బాబుతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ తుది వీడ్కోలు పలికారు.

రమేశ్ బాబు లేకుంటే తాను ఇప్పుడు ఈ స్థితిలో ఉండేవాడిని కాదని మహేశ్ వ్యాఖ్యానించారు. "తనే (రమేశ్ బాబు) నాకు స్ఫూర్తి, బలం, ధైర్యం, సర్వస్వం. నాకు మరో జన్మంటూ ఉంటే రమేశ్ బాబే అన్నయ్యగా ఉండాలి" అంటూ ఉద్వేగానికి లోనయ్యారు మహేశ్. తన కోసం ఎంతో చేసిన రమేశ్ బాబుకు ధన్యవాదాలు తెలిపిన మహేశ్.. ఎల్లప్పుడు రమేశ్​ను ప్రేమిస్తూనే ఉంటానని ట్విట్టర్ వేదికగా సోదరుడిపై ప్రేమను చాటుకున్నారు.

అయితే ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని సామాజిక మాద్యమాల్లో మహేశ్ బాబు అభిమానులు కూడా భావోద్వేగంగా పోస్టులు పెడుతున్నారు. మహేశ్ ధైర్యంగా ఉండాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి:Maheshbabu brother died: రమేశ్​బాబుకు కన్నీటి వీడ్కోలు

ABOUT THE AUTHOR

...view details