తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Mahesh babu new movie: రాజమౌళితో సినిమాపై మహేశ్​ క్లారిటీ - ఆర్ఆర్​ఆర్ మూవీ

స్టార్ దర్శకుడు రాజమౌళితో సినిమాపై మహేశ్​(mahesh babu new movie) స్పష్టతనిచ్చారు. అన్ని భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతుందని, దీనితోనే బాలీవుడ్​లోకి అరంగేట్రం చేయనున్నానని అన్నారు. వచ్చే ఏడాది ద్వితియార్ధంలో ఈ సినిమా మొదలుకావొచ్చు.

mahesh babu rajamouli movie
మహేశ్​బాబు

By

Published : Oct 14, 2021, 5:46 PM IST

'ఆర్ఆర్ఆర్'(rrr release date) డైరెక్టర్​ రాజమౌళి తర్వాత సినిమా(rajamouli next movie) ఎప్పుడో ఫిక్సయింది. సూపర్​స్టార్ మహేశ్​తో(mahesh babu new movie) ఆయన కలిసి పనిచేస్తారని గతంలో రాజమౌళినే స్వయంగా ప్రకటించారు. అప్పటినుంచి పలానా కథతో, పలానా చోట తీస్తారు అంటూ పలు ఊహాగానాలు కూడా వచ్చాయి. అవన్నీ పక్కనపెడితే ఇప్పుడు మహేశ్​ కూడా ఈ సినిమా గురించి స్పష్టత ఇచ్చారు.

"నేనెప్పుడూ సరైన సమయంలో సరైన సినిమాలే చేస్తాను. హిందీలో సినిమా చేయడానికి ఇదే సరైన సమయం. నా తర్వాత సినిమా రాజమౌళితో చేస్తున్నా. ఇది అన్ని భాషల్లో ఉంటుంది" అని మహేశ్​బాబు(mahesh babu new movie), ఫోర్బ్స్​ ఇండియా ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు సమధానమిస్తూ ఇలా చెప్పారు.

సూపర్​స్టార్ మహేశ్​బాబు

'ఆర్ఆర్ఆర్'(rrr songs) వచ్చే ఏడాది విడుదల కానుంది. ఆ తర్వాత మహేశ్​-రాజమౌళి సినిమా మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మహేశ్​ 'సర్కారు వారి పాట'(sarkaru vaari paata release date) చేస్తున్నారు. ఇది సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వస్తుంది.

అయితే ఈ సినిమా అడ్వెంచర్​ కథతో తెరకెక్కనుందని, ఆఫ్రికా అడవుల్లో తీస్తారని ప్రచారమూ గతంలో ఉంది. కానీ రాజమౌళి మన దగ్గర కాకుండా విదేశీ నేపథ్య కథతో ఇప్పటివరకు సినిమా తీయలేదు. మరి మహేశ్​ చిత్రంతో ఆ ప్రయోగం చేస్తారేమో చూడాలి!

'ఆర్ఆర్ఆర్' ప్రకటించిన తర్వాత థియేటర్లలోకి రావడానికి దాదాపు మూడేళ్ల సమయం పట్టనుంది. దీంతో మహేశ్​ సినిమా ఇంకెన్నాళ్లు పడుతుందో అని సోషల్ మీడియాలో అభిమానులు చర్చించుకుంటున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details