సూపర్‌స్టార్ మహేశ్‌బాబు.. 'సర్కారు వారి పాట' షూటింగ్లో భాగంగా దుబాయ్‌లో ఉన్నారు. చిత్రీకరణ ఫొటోలు కొన్ని ఇప్పటికే వైరల్ అవుతుండగా, లోకేషన్‌కు సంబంధించిన మూడు ఫొటోలను మహేశ్ స్వయంగా ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. 'ఇన్5దుబాయ్' సంస్థలో షూటింగ్ చేయడం మర్చిపోలేని అనుభూతి అని రాసుకొచ్చారు.
'సర్కారు వారి పాట' ఫొటోలు.. ఇన్‌స్టాలో మహేశ్ పోస్ట్ - మహేశ్ బాబు న్యూస్
తన కొత్త లొకేషన్ ఫొటోలు కొన్నింటిని మహేశ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం దుబాయ్‌లో శరవేగంగా చిత్రీకరణ సాగుతోంది.
'సర్కారు వారి పాట' ఫొటోలు.. ఇన్‌స్టాలో మహేశ్ పోస్ట్
ఈ సినిమాలో కీర్తి సురేశ్ హీరోయిన్గా నటిస్తోంది. బ్యాంకుల్లో డబ్బుల ఎగవేత నేపథ్య కథతో దీనిని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీస్, జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి చిత్రాన్ని తీసుకురానున్నారు.