తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'మహర్షి' విజయంతో మహేశ్​ విహారయాత్ర

'మహర్షి' ఇచ్చిన ఆనందంతో మరోసారి విహారయాత్రకు సిద్ధమయ్యాడు మహేశ్​బాబు. కుటుంబంతో వెళ్తున ఈ ట్రిప్ ఎంతో ప్రత్యేకమైనదని ట్విట్టర్​లో​ పేర్కొన్నాడు.

కుటుంబంతో మరోసారి విహారయాత్రకు

By

Published : May 20, 2019, 8:35 PM IST

ఇటీవల విడుదలైన మహేశ్​బాబు 'మహర్షి' పాజిటివ్ టాక్​తో దూసుకుపోతోంది. ఈ ఆనందాన్ని సెలబ్రేట్​ చేసుకునేందుకు వియారయాత్రకు వెళ్తున్నాడు సూపర్​స్టార్. ఈ విషయాన్ని ట్విట్టర్​లో పంచుకున్నాడు.

‘మరో మధురమైన విహారయాత్రకు వెళ్తున్నాం. ఇది మరింత ప్రత్యేకం’ -ట్విట్టర్​లో మహేశ్​బాబు

‘మహర్షి’ చిత్రీకరణ పూర్తయ్యాక కుటుంబంతో కలిసి విహార యాత్రకు పారిస్‌ వెళ్లాడు మహేశ్​. తిరిగి వచ్చాక ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. తాను కష్టపడినదానికి ఫలితం దక్కినందుకు ఇప్పుడు మరో ఫ్యామిలీ ట్రిప్‌ను ప్లాన్‌ చేసుకున్నాడు.

విహారయాత్ర నుంచి వచ్చాక అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో నటించనున్నాడు మహేశ్​బాబు. జూన్‌లో చిత్రీకరణ మొదలు కానుంది. ఆ తర్వాత పరశురామ్‌తో కలిసి సినిమా చేసే అవకాశాలున్నాయి.

ABOUT THE AUTHOR

...view details