తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సౌండ్​ రికార్డిస్ట్​పై సూపర్​స్టార్​ ప్రశంసలు - టాలీవుడ్​ సూపర్​స్టార్​ మహేశ్​బాబు

టాలీవుడ్​ సూపర్​స్టార్​ మహేశ్​బాబు ఓ సౌండ్​ రికార్డిస్ట్​తో తన అనుబంధాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా గుర్తుచేసుకున్నాడు. తనతో పాటు చాలా ఏళ్లుగా పనిచేస్తోన్న ఆ టెక్నీషియన్​పై ప్రశంసలు కురిపించాడు. అంతేకాకుండా ఇద్దరూ కలిసి తీసుకున్న కొన్ని ఫొటోలను ఇన్​స్టాలో పంచుకున్నాడు ప్రిన్స్​.

సౌండ్​ రికార్డిస్ట్​పై సూపర్​స్టార్​ ప్రశంసలు

By

Published : Sep 19, 2019, 6:03 PM IST

Updated : Oct 1, 2019, 5:45 AM IST

సినీహీరోలు అందంగా కనిపించేందుకు.. ఆ స్థాయిలో పేరు తెచ్చుకునేందుకు తెరవెనక ఎంతో మంది కష్టం దాగి ఉంటుంది. అయితే కొంత మందే వారి కష్టాన్ని గుర్తిస్తారు. ఆ వరుసలో ముందున్నాడు టాలీవుడ్ సూపర్​స్టార్ మహేశ్​బాబు. తన దగ్గర ఎన్నో ఏళ్ల నుంచి ఓ టెక్నీషియన్​ పనిచేస్తున్నాడని, అతడితో ప్రయాణంఇప్పటికీ అంతే ఆనందంగా సాగుతోందని..అతడితో ఉన్న అనుబంధాన్ని నెటిజన్లతో పంచుకున్నాడు ప్రిన్స్‌. అంతేకాకుండా ఇద్దరూ కలిసి తీసుకున్న ఫొటోలనూ ఇన్ స్టాలో షేర్ చేశాడు.

" ఈయనే నా సౌండ్‌ రికార్డిస్ట్‌ నగర రాము. నా మొదటి చిత్రం నుంచి నాతోనే ఉన్నారు. నా సెట్‌లో తప్ప ఆయన వేరే సెట్‌లో కనిపించరు. ఎల్లప్పుడూ నాతోనే, నావెంటే ఉన్నందుకు ఆయనంటే మంచి గౌరవం, ప్రేమ ఉన్నాయి. అన్నా తమ్ముడు, దూకుడు, మహర్షి’, సరిలేరు నీకెవ్వరు చిత్రీకరణల సమయంలో అతడితో తీసుకున్న కొన్ని అందమైన జ్ఞాపకాలు ఉన్నాయి".
-- మహేశ్​బాబు, సినీ నటుడు

సౌండ్​ రికార్డిస్ట్​తో మహేశ్​

ప్రస్తుతం మహేశ్‌ నటిస్తున్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. రష్మిక కథానాయిక. అనిల్‌ రావిపూడి దర్శకుడు. విజయశాంతి ఈ చిత్రంతోనే తెలుగుతెరపై రీఎంట్రీ ఇవ్వనుంది. దిల్‌రాజు, మహేశ్‌బాబు, రామబ్రహ్మం సుంకర సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ బాణీలు అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇటీవల మహేశ్​, నమ్రత జంటగా ఉన్న ఫొటోను అవినాశ్​ గోవరికర్​ అనే ఫొటోగ్రాఫర్​ పంచుకోగా... దానిపై సమాధనామిచ్చాడు ప్రిన్స్​. అద్భుతమైన ఫోజు తీశావని అతడికి కితాబిచ్చాడు.

Last Updated : Oct 1, 2019, 5:45 AM IST

ABOUT THE AUTHOR

...view details