టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు.. రోజు రోజుకూ వయసు తగ్గించుకుంటున్నాడు. తన నటనతోనే కాకుండా అందంతో ఎంతో మంది యువతులను మాయలో పడేశాడు. లాక్డౌన్ కారణంగా ఈ హీరోప్రస్తుతం ఇంటికే పరిమితమయ్యాడు. ఖాళీ సమయాన్ని తన పిల్లలతో ఆహ్లాదకరంగా గడుపుతున్నాడు. తాజాగా మహేశ్.. తన కుమారుడు, కుమార్తెతో కలిసి దిగిన ఫొటోను నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇందులో క్లీన్ షేవ్ చేసుకుని కనబడుతున్నాడు ప్రిన్స్. ఈ చిత్రం ప్రస్తుతం వైరల్‌గా మారింది.
వైరల్: చిన్న పిల్లాడిలా మారిపోయిన మహేశ్! - మహేశ్‌బాబు కొత్త సినిమా అప్డేట్
సూపర్‌స్టార్ మహేశ్‌బాబుకు సంబంధించిన ప్రతి అప్డేట్ను తన భార్య నమ్రతా శిరోద్కర్ సామాజిక మాధ్యమాల్లో అభిమానులకు చేరవేస్తోంది. అయితే తాజాగా మహేశ్ సెల్ఫీని ఇన్‌స్టాలో షేర్చేసింది. ఆ చిత్రంలో సూపర్‌స్టార్ యువకుడిలా కనిపించాడు.
వైరల్: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు న్యూలుక్!
ఈ ఏడాది ప్రారంభంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు మహేశ్. ఆ తర్వాత సినిమా ఎవరితో చేయబోతున్నాడో ఇంకా స్పష్టత ఇవ్వలేదు. అయితే పరశురామ్ డైరెక్షన్లో ఓ మూవీ చేయనున్నాడని టాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది.
ఇదీ చూడండి.. కేన్స్ ఫెస్టివల్ జ్ఞాపకాలను పంచుకున్న ప్రియాంక