సూపర్‌స్టార్ మహేశ్‌బాబు దర్శకుడు వంశీ పైడిపల్లిపై ప్రేమ కురిపించాడు. మహర్షి చిత్రాన్ని హిట్ చేసినందుకు ఆత్మీయంగా ముద్దు పెట్టాడు. సంబంధిత ఫొటోను ట్విట్టర్లో పంచుకున్నాడీ డైరక్టర్.
"ఇది నా జీవితంలో బెస్ట్ మూమెంట్. ఇంతకంటే మరేం కోరుకోను" -ట్విట్టర్లో వంశీ పైడిపల్లి
ట్విట్టర్లో వంశీ పైడిపల్లి పోస్ట్
మహేశ్‌బాబు మూడు విభిన్న పాత్రల్లో కనిపించిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. అల్లరి నరేశ్ పాత్రకు ప్రశంసలు దక్కుతున్నాయి. రైతులకు సంబంధించిన ఎపిసోడ్లు చిత్రానికే హైలైట్‌గా నిలిచాయి.
ఇది చదవండి: సక్సెస్ మీట్లో 'మహర్షి' దర్శకుడి భావోద్వేగం