తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రౌడీబాయ్​ సినిమాకు నిర్మాతగా మహేశ్​! - Vijay Devarakonda movie producer mahesh

విజయ్​దేవరకొండ హీరోగా నటించబోయే ఓ సినిమాను మహేశ్​బాబు నిర్మించబోతున్నట్లు టాక్​. ఇప్పటికే ఈ విషయమై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.

vijay, mahesh
విజయ్​, మహేశ్​

By

Published : May 10, 2020, 12:57 PM IST

సూపర్​స్టార్​ మహేశ్​ బాబు.. హీరోగా కాకుండా నిర్మాతగానూ తెరవెనుక సత్తా చాటుతున్నాడు. జీఎంబీ ఎంటర్‌టైన్​మెంట్స్​ సంస్థ ద్వారా తన చిత్రాలతో పాటు వేరే కథానాయకుల సినిమాలను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం అడవి శేష్​తో 'మేజర్'​ తీస్తున్న ప్రిన్స్... త్వరలో విజయ్ దేవరకొండ కొత్త ప్రాజెక్టును నిర్మించనున్నట్లు సమాచారం.

ఇప్పటికే ఇందుకు సంబంధించిన చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అధికారక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. దీనితో పాటు కార్తీ హీరోగా మరో సినిమాను నిర్మించేందుకు మహేశ్​ సన్నాహాలు చేస్తున్నట్లు టాక్.

ఇదీ చూడండి : రెండో పెళ్లికి సిద్ధమైన నిర్మాత దిల్​రాజు

ABOUT THE AUTHOR

...view details