మంచి కథ కుదిరితే మరో మల్టీస్టారర్ చిత్రంలో నటించడానికి సిద్ధమంటున్నాడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్ నటించిన తాజా చిత్రం 'మహర్షి'. పూజాహెగ్డే హీరోయిన్గా నటించగా అల్లరి నరేశ్ కీలకపాత్ర పోషించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్, పీవీపీ సినిమా బ్యానర్లపై దిల్‌రాజు, అశ్వనీదత్, ప్రసాత్ వి.పొట్లూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మే9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మహేశ్ పలు విషయాలను విలేకరులతో పంచుకున్నాడు.
- 25 సినిమాగా చేద్దామనే ‘మహర్షి’ కథ ఆపా..
దర్శకుడు వంశీ పైడిపల్లి 40 నిమిషాల పాటు నాకు 'మహర్షి' కథ చెప్పారు. కథ విన్నంత సేపూ భలే అనిపించింది. అప్పటికే నా చేతిలో సినిమాలు ఉన్నందు వల్ల ‘నా 25వ సినిమాను ఈ కథతో చేద్దాం.. నాకోసం కొంతకాలం ఆగుతావా?’ అని వంశీని అడిగాను. అందుకే మా ఇద్దరి కలయికలో సినిమా చేయడానికి ఇంతకాలం పట్టింది.
- అలాంటి పాత్రలే వస్తున్నాయి ఏం చేద్దాం..
ఒకే గెటప్‌తో సినిమాలు చేస్తున్నానని నాపై విమర్శలు వస్తున్నాయి. కానీ, ఏం చేద్దాం అలాంటి పాత్రలే నా దగ్గరకు వస్తున్నాయి. 'మహర్షి’లో నేను మూడు విభిన్న పాత్రలు పోషించా. విద్యార్థిగా, ఒక సంస్థకు సీఈవోగా, రైతుగా ఇందులో కనిపిస్తా. ఒకే తరహా పాత్రలు చేస్తున్నానని ఫీలవుతున్న అభిమానులకు ఈ సినిమా ఒక ట్రీట్‌లా ఉంటుంది.
- ఆ పాత్ర నాకు ఛాలెంజ్ అనిపించింది..
'మహర్షి'లో నేను చేసిన మూడు పాత్రల్లో స్టూడెంట్ పాత్ర, ఆ పాత్రలో వచ్చిన సన్నివేశాలు నాకు ఛాలెంజింగ్ అనిపించాయి. ఈ విషయంలో దర్శకుడు వంశీని అభినందించాలి. నాలో నమ్మకాన్ని పెంచడం వల్ల ఆ పాత్రను చాలా సులువుగా చేశా.
- వాళ్ల పేర్లు చెప్పడం మర్చిపోయా..
'మహర్షి' ప్రీరిలీజ్ వేడుక సందర్భంగా ఒకేసారి అభిమానులు వేదికపై రావడం వల్ల దర్శకుడు పూరి జగన్నాథ్, సుకుమార్‌ల పేర్లు.. వారితో చేసిన సినిమాలను గుర్తు చేసుకునే అవకాశం నాకు రాలేదు. ‘వన్: నేనొక్కడినే’ ఒక కల్ట్ క్లాసిక్ చిత్రమే కాదు, నా సినిమాల్లో ఉత్తమ చిత్రం. ఈ విషయంలో సుకుమార్‌ను అభినందించక తప్పదు.
- నా సినిమాలన్నీ ‘మే లోనే రిలీజ్ చేయమంటారు..
‘మే 9న 'మహర్షి’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నాం. ఈ సినిమా విడుదలయ్యాక ఇక నుంచి నా సినిమాలన్నీ మేలోనే రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ పట్టుబట్టే అవకాశం ఉంది(నవ్వుతూ) ‘మహర్షి’ని నాన్నగారు కూడా చూసి, చాలా సంతోషించారు.
- అందుకే సుకుమార్ సినిమా చేయడం లేదు..
సుకుమార్ నాకు ఒక బలమైన ఇతివృత్తం కలిగిన కథను చెప్పాడు. నేనేమో ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగే కథ చేయాలని భావించా. అందుకే సుకుమార్ కథను పక్కన పెట్టి, అనిల్ రావిపూడి చెప్పిన కథకు ఓటేశా. నా నిర్ణయంతో సుకుమార్ ఏకీభవించాడు. భవిష్యత్‌లో మేమిద్దరం తప్పకుండా సినిమా చేస్తాం.
- వారితో సినిమాలు చేయడం లేదన్నది అవాస్తవం